‘సుజుకి మోటార్ కార్పొరేషన్’ మాజీ చైర్మన్ ‘ఒసాము సుజుకి’ కన్నుమూశారు. శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 94 ఏళ్లు కాగా లింఫోమాతో ఆయన చనిపోయారని సుజుకి కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
జపాన్లోని గెరోలో 1930 జనవరి 30న ఒసాము జన్మించారు . సుమారు నలభై ఏళ్ల పాటు కంపెనీని నడిపించారు. 2021లో తన 91వ ఏట రిటైర్మెంట్ ప్రకటించారు. 2015లోనే సుజుకి అధ్యక్ష బాధ్యతలు తన కుమారుడికి అప్పగించారు.
ఒసాము సుజుకి సారథ్యంలో కంపెనీ 31 దేశాలకు విస్తరించింది. 60 ప్లాంట్లతో సుమారు 190 దేశాలలో విక్రయాలు జరుపుతోంది. కార్లు, టూ వీలర్ విభాగంలో గట్టి పోటీదారుగా ఉంది.
పారిశ్రామిక రంగంలో ఒసాము సుజుకి చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మ భూషణ్’తో సత్కరించింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సితార ఏ పాకిస్తాన్ అవార్డుతో గౌరవించింది.