తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి డిగ్రీ థర్డ్ ఈయర్ ను కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. దీంతో లాంగ్వేజెస్ ను మొదటి, రెండో ఏడాదిలోనే చదవాల్సి ఉంటుంది.
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.
వాస్తవానికి ఈ విధానమే 2020కి ముందు అమలైంది. 2021లో డిగ్రీ కోర్సులను సంస్కరించిన ఉన్నత విద్యామండలి… థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్‌ను చేర్చింది. నాలుగేళ్ళు దాటకుండానే నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకుంది.
డిగ్రీ థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్‌ను తప్పనిసరి చేసిన ఉన్నత విద్యామండలి, ప్రాక్టికల్స్ బదులుగా ప్రాజెక్ట్‌ను సిలబస్ లో చేర్చారు. ప్రస్తుతానికి ఇంజినీరింగ్ సహా కొన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్‌ను అమలుచేస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్‌కు క్రెడిట్స్ కేటాయించారు.
ఆన్లైన్ వేదికల ద్వారా అభ్యసించిన కొన్ని కోర్సుల క్రెడిట్స్‌ను సైతం క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.