స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి కొంత తగ్గి స్థిరపడ్డాయి. ఒక దశలో 79 వేలు దాటిన సెన్సెక్స్‌లో తరవాత కరెక్షన్ చోటు చేసుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్
228 పాయింట్లు పెరిగి, 78699 వద్ద ముగిసింది. నిఫ్టీ 63 పెరిగి, 23813 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాలను ఆర్జించాయి. టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, జొమాటో నష్టాలను చవిచూశాయి.
డాలరుతో రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 85.52కు దిగజారింది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు బంగారం 2639 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ముడి చమురు ధర స్వల్పంగా పెరిగింది. బ్యారెల్ ముడిచమురు 73.37 అమెరికా డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
అంతర్జాతీయంగా లభించిన సానుకూల వార్తలతో దేశీయ స్టాక్ సూచీలు పరుగులు తీశాయి. బ్యాంకింగ్, హెల్త్, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో ప్రారంభం కావడం దేశీయ మార్కెట్లకు కలసి వచ్చింది.