ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కొత్త కోణం వెలుగు చూసింది. రెండున్నరేళ్లుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు కూడా పోరాడుతున్నారు. రష్యా తరపున ఉత్తర కొరియా పది వేల మంది సైనికులను పంపించింది. వారంతా కుర్క్ ప్రాంతంలో యుద్ధం చేస్తున్నారు. ఇటీవల ఉత్తర కొరియాకు చెందిన కిమ్ అనే సైనికుడు తీవ్రంగా గాయపడి ఉక్రెయిన్ సైనికులకు చిక్కాడు. ఈ విషయాన్ని ఉత్తర కొరియా స్పై ఏజన్సీ స్వయంగా ప్రకటించింది.
రష్యా సైనికుల భాష ఉత్తరకొరియా సైనికులకు అర్థం కావడం లేదని అందుకే వేలాది మంది సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ముందుగా ఉత్తర కొరియా సైనికులకు రష్యా శిక్షణ కూడా ఇచ్చింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. కుర్క్ ప్రాంతంలో ఒకే గ్రామంలో పది వేల మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించారు. రష్యా సైనికుల సంకేతాలు అర్థం కాక 3 వేల మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే దీనిపై ఉత్తర కొరియా స్పందించలేదు.ఉక్రెయిన్ సైనికులు డ్రోన్లతో ఉత్తర కొరియా సైనికులను పరుగులు పెట్టించిన వీడియో ఒకటి వైరల్ అయింది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 7 లక్షల మంది చనిపోయి ఉంటారని అంచనా. రష్యా 3 లక్షల సైన్యాన్ని కోల్పోయింది. చివరకు ఉత్తర కొరియా సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక సైనికులకు సాయం చేసేందుకు పలు దేశాల నుంచి యువతను దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా భారత్ నుంచి కూడా 5 వేల మందిని యుద్ధ సైనికులకు సాయం చేసుకునే పనిలో పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి.