310 పరుగులు వెనకబడిన భారత్
కెరీర్ లో తొమ్మిదో హాఫ్ సెంచరీ చేసిన జైస్వాల్
రోహిత్ శర్మ, కోహ్లీ మరోసారి విఫలం
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికి 46 ఓవర్లు ఆడిన భారత్, ఐదు వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. ఆసీస్ చేసిన 474 పరుగులు అందుకునేందుకు మరో 310 పరుగులు అవసరం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో జడేజా (4*), పంత్ (6*) ఉన్నారు.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ( 82) రన్ ఔట్ గా వెనుతిరగడంతో భారత్ కు భారీ నష్టం వాటిల్లింది. 118 బంతులు ఆడి 82 పరుగులు చేసిన జైస్వాల్ రన్ ఔట్ కావడంతో భారత్ మూడో వికెట్ ను 153 పరుగులు వద్ద కోల్పోయింది.
రోహిత్ శర్మ( 3),ఆకాశ్ దీప్( 0) నిరాశ పరచగా కేఎల్ రాహుల్( 24), కోహ్లీ( 36)
పరుగులు చేసి వెనుదిరిగారు.
ఆసీస్ బౌలర్లలో కమిన్స్ , బోలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది.ప్రస్తుతం భారత్, ఆసీస్ కంటే 310 పరుగులు వెనకబడి ఉంది.