నటుడు అల్లు అర్జున్ కేసును నాంపల్లి కోర్టు విచారించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా అల్లు అర్జున్ కేసును న్యాయమూర్తి విచారించారు. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. న్యాయమూర్తి అంగీకరించారు. వచ్చే సోమవారానికి కేసు వాయిదా వేశారు. ఈ లోగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ సంధ్య థియోటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి చనిపోయిన సంగతి తెలిసిందే ఈ కేసులో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయగా కొర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కేసుపై వాదనలు నడుస్తున్నాయి. అనుమతి ఇవ్వకపోయినా నటుడు సంధ్యా థియోటర్‌కు వచ్చాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు.
అనుమతులు ఇవ్వని విషయం థియోటర్ యాజమాన్యం తనకు చెప్పలేదని నటుడు అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. రేవతి చనిపోయిన విషయం కూడా ఆలస్యంగా తెలిసిందని చెప్పుకొచ్చారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. రేవతి చనిపోయినా, థియోటర్ నుంచి బయటకు వచ్చి ర్యాలీ చేశాడని అభియోగాలు మోపారు.