స్టీవ్ స్మిత్ సెంచరీ
ఛేదనలో 51 పరుగులకే రెండు వికెట్లు నష్టపోయిన భారత్
బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ , 81 బంతుల్లో అర్ధశతకం కొట్టాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం నిరాశపరిచాడు. కేవలం ఐదు బంతులు ఆడి మూడు పరుగులు చేసి పాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (24) కూడా కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, జడేజా మూడు, ఆకాశ్ దీప్ రెండు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.