పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో కటస్ రాజ్ దేవాలయం హిందువుల పుణ్యక్షేత్రం. భారతదేశం నుంచి ఇటీవల అక్కడికి 70మంది హిందూ యాత్రికుల బృందం వెళ్ళింది. దేవాలయ దర్శనం పూర్తి చేసుకుని బుధవారం తిరిగి భారత్ చేరుకుంది. వాఘా సరిహద్దు దగ్గర పాకిస్తానీ అధికారులు భారత బృందానికి పుష్పగుచ్ఛాలు, ప్రత్యేక కానుకలు ఇచ్చి వీడ్కోలు పలికారు.
హిందూ భక్తబృందం వారం రోజుల పాటు పాకిస్తాన్లో పర్యటించింది. కటస్ రాజ్ దేవాలయంతో పాటు వారు లాహోర్‌లోని రావి రోడ్లో కృష్ణ దేవాలయాన్ని, అనార్కలిలోని వాల్మీకి ఆలయాన్నీ కూడా సందర్శించారు. మందిరాల్లో పూజలు చేయడంతో పాటు భారత పౌరులు అనార్కలి మార్కెట్‌ను, లాహోర్ కోటను కూడా సందర్శించారు.
దర్శనాలు పూర్తిచేసుకుని స్వదేశానికి బయల్దేరిన భారతీయ బృందానికి ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ అదనపు కార్యదర్శి సైఫుల్లా ఖోఖర్, వాఘా సరిహద్దు దగ్గర పుష్పగుచ్ఛాలు, కానుకలు అందించారు. రెండుదేశాల మధ్యా పరిస్థితులను మెరుగు పరచడంలో ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం : సీఎం చంద్రబాబునాయుడు