మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్‌బోర్న్‌వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. తొలి రోజు 86 ఓవర్ల ఆట జరిగింది. ఆసీస్ టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో 3.62 రన్ రేట్ సాధించింది.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్టీవ్ స్మిత్ (68), పాట్ కమిన్స్ (8)పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓపెనర్లు సామ్ కొంస్టాస్( 60), ఉస్మాన్ ఖవాజా (57), లబుషేన్( 72) రాణించారు. ట్రావిస్ హెడ్( 0), మిచెల్ మార్ష్( 4) స్వల్ప స్కోర్ కు వెనుదిరిగినప్పటికీ, అలెక్స్ క్యారీ 41 బంతుల్లో 31 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా వికెట్లు వికెట్లు తీయగా, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు .
ఆసీస్ అరంగేట్ర బ్యాటర్ కొంటాస్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న అరంగేట్ర ప్లేయర్‌ను ఫీల్డింగ్ లో భాగంగా కోహ్లీ ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఆ వెంటనే తోటి ఆటగాళ్ళ తో పాటు అంపైర్లు జోక్యం చేసుకుని వివాదాన్ని చల్లార్చారు.