కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో మత ప్రచారం కోసం వచ్చిన క్రైస్తవులు, అడ్డుకున్న హిందూ యువకుడిపై దాడి చేసిన ఘటన ఇటీవల చోటు చేసుకుంది.
కొద్దిరోజుల క్రితం గ్రామంలోకి వేరే ఊళ్ళ నుంచి కొందరు క్రైస్తవులు వచ్చారు. హిందువుల ఇళ్ళు, పోతురాజు జాతర చేసుకునే స్థలం మధ్యలో క్రైస్తవ మత సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేసారు. క్రైస్తవంలోకి మతం మారమని ప్రచారం చేసే క్రమంలో హిందూ దేవీ దేవతలను పూజిస్తే నరకానికి పోతారని, రాళ్ళూరప్పలను పూజించవద్దంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. క్రైస్తవ మతమౌఢ్యంతో రాజ్యాంగానికీ, చట్టానికీ వ్యతిరేకంగా హిందువుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ విమర్శలు చేసారు. ఆ ప్రచారంతో మనోభావాలు దెబ్బతిన్న స్థానిక హిందువులు అటువంటి మత ప్రచారానికి అభ్యంతరం తెలిపారు.
వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవులు అప్పటికి వెళ్ళిపోయారు. రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. పటవల గ్రామ వీధుల్లో పెద్ద సౌండ్ సిస్టంలతో హిందువుల ఇళ్ళ మధ్యలో తిరుగుతూ మత ప్రచారం కొనసాగించారు. వారిని
స్థానిక హిందూ యువకుడు మేడిశెట్టి శ్రీనుప్రసాద్ అడ్డుకున్నాడు. దాంతో వారు అప్పటికి అక్కణ్ణుంచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి సుమారు 11గంటల వేళ, సుమారు 30 మంది ఆ యువకుడి ఇంటిపైకి దండెత్తారు. అతన్ని ఇంటినుంచి బైటకు రమ్మని పిలిచి, రామాలయం దగ్గర అతనిచుట్టూ గుమిగూడారు. కర్రలు, రాడ్లు మొదలైన మారణాయుధాలతో విచక్షణా రహితంగా మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు. శ్రీనుప్రసాద్ కేకలు విన్న స్థానిక యువత అక్కడికి చేరుకోవడంతో అక్కడినుంచి పారిపోయారు.
ఆ సంఘటన విషయమై కేసు నమోదు చేయడానికి శ్రీనుప్రసాద్ కోరంగి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. కోరంగిలో పాస్టర్‌గా పనిచేస్తున్న నాగబాబు, శ్రీనుప్రసాద్పై దాడిచేసిన వారు తమవారే అని ఒప్పుకొని, పెద్దల సమక్షంలో రాజీకి వెళదామని చెప్పాడు. మరునాడు, దాడి చేసిన వారిని దాచిపెట్టి వారి తరఫున క్షమాపణ కోరాడు. లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి రాజీ కుదురుద్దామని చూసాడు.
అయితే హిందూ యువకుడు, అతని తరఫున వచ్చిన పెద్దలు రాజీకి ఒప్పుకోలేదు. దాడి చేసిన వారిని తీసుకు రమ్మని పట్టుపట్టారు. అప్పుడు పాస్టర్ నాగబాబు, దాడి చేసిన ముప్పై మందిలో ఐదుగురిని మాత్రం చూపించాడు. చుట్టుపక్కల పాస్టర్లు, క్రైస్తవ మహిళల్ని తీసుకొచ్చి వారితో అసభ్యంగా ప్రవర్తించాడన్న దొంగ ఆరోపణలతో రివర్స్ కేసు పెడతామని బెదిరించాడు.
వివిధ గ్రామాల నుండి తమ గ్రామానికి వచ్చి హిందువుల ఇళ్ళ మధ్యలో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ, తమ మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ మతకలహాలు సృష్టిస్తున్న పాస్టర్లు, క్రైస్తవులపై తగు చర్యలు తీసుకుని మతసామరస్యాన్ని కాపాడాలని శ్రీనుప్రసాద్ కోరుతున్నాడు. ఆ వ్యవహారంలో తనకు అండగా ఉండాలంటూ హిందూ ధార్మిక సంస్థలను అర్ధిస్తున్నాడు.