మెల్‌బోర్న్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య నాలుగో టెస్ట్
టీ బ్రేక్ సమయానికి ఆసీస్ 176/2
భారత్, ఆస్ట్రేలియా జట్ల ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో మ్యాచ్ జరుగుతోంది. బాక్సింగ్ డే టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. 53 ఓవర్లలో ఈ స్కోర్ సాధించింది.
ఆసీస్ అరంగేట్రం ఆటగాడు సామ్ కొంటాస్ 65 బంతుల్లో 60 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు . మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కూడా హాఫ్ సెంచరీ చేశాడు. 121 బంతులు ఆడి జస్ప్రిత్ బుమ్రా వేసిన 44.1 బంతిని ఆడి కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఆసీస్ 154 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది.
తొలి టెస్ట్ ఆడుతున్న ఆసీస్ ఓపెనర్ కాన్ సాంటోస్, బుమ్రా బౌలింగ్ లో దంచి కొట్టాడు. మొదటి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీ బ్రేక్ సమాయానికి ఆసీస్ 176 పరుగులు చేసింది.
కొంటాస్, భారత ఆటగాడు విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం జరిగింది. ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న అరంగేట్ర ప్లేయర్‌ను ఫీల్డింగ్ లో భాగంగా కోహ్లీ ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఆ వెంటనే తోటి ఆటగాళ్ళ తో పాటు అంపైర్లు జోక్యం చేసుకుని వివాదాన్ని చల్లార్చారు.