ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మూడు నెలల క్రితం పోలీసులు, మేజిస్ట్రేట్ మీద ఇస్లామిక్ మూక హింసాత్మక దాడికి పాల్పడిన సంఘటనలో ప్రధాన నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ముస్లిం మూకను రెచ్చగొట్టి పోలీసులు, న్యాయమూర్తి మీద దాడి చేసేలా పురిగొల్పిన ఫిరదౌస్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సంఘటన జరిగినప్పటినుంచీ భద్రక్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొని ఉంది.
అసలు సంఘటన ఈ యేడాది సెప్టెంబర్ 27న జరిగింది. ఒక సోషల్ మీడియా పోస్టుతో వివాదం రాజుకుంది. పురునా బజార్ పరిధిలోని నంగమహాల ప్రాంత నివాసి అయిన ఫిరదౌస్ ఖాన్, తన మతానికి చెందిన వ్యక్తులను గుంపుగా చేర్చి సెంతియా బ్రిడ్జి ప్రాంతంలో అనధికార నిరసన ప్రదర్శన చేపట్టాడు. ఆ ఆందోళన కొద్దిసేపట్లోనే హింసాత్మకంగా మారింది. ముస్లిం మూకలు టైర్లు తగులబెట్టడం, రోడ్లు బ్లాక్ చేయడం, పోలీసులు-ఇతర అధికారులపై దాడులకు పాల్పడడం వంటి పనులు చేసారు.
భద్రక్ జిల్లా ఏఎస్పీ అన్షుమాన్ ద్వివేదీ చెప్పిన వివరాల ప్రకారం ముస్లిం మూక సంగ్రామ్ ప్రియదర్శి కుంతియా అనే తెహసీల్దారు, ఆన్ డ్యూటీ మేజిస్ట్రేట్ దగ్గరున్న ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసారు. వారి దాడిలో సిటీ డీఎస్పీ, ఏఎస్ఐలకు తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్ఐ రాజకిషోర్ ముర్ము తలకు బలమైన దెబ్బలు తగలడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది, ఆయనను ఆస్పత్రిలో చేర్చారు.
ఆ సంఘటన తర్వాత ఫిరదౌస్ ఖాన్ మీద సహరాంచల్, పురునా బజార్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు రిజిస్టర్ అయ్యాయి. దాంతో ఖాన్ తప్పించుకుని పారిపోయాడు. ఎట్టకేలకు అతన్ని మరో కేసు విచారణ కోసం వచ్చినప్పుడు మంగళవారం పట్టుకున్నారు.
సెప్టెంబర్ 27న భద్రక్‌లో ముస్లిములు పాల్పడిన దాడిలో ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ముస్లిములు చుట్టుముట్టి తహసీల్దారు వాహనాన్ని నాశనం చేసారు. అధికారులపై రాళ్ళ దాడులకు పాల్పడ్డారు. ఆ దాడిలో తెహసీల్దార్ వాహనం ధ్వంసమైంది.