బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం కారణంగా తీరం వెంబడి తీవ్రమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. , అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, లోతట్టు, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం పడింది. రెండురోజులపాటు వానలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే ఐదు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ప్రస్తుతమున్న అల్పపీడనం బలహీనపడుతున్న దశలో మరోటి ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో డిసెంబర్ లో వరుస అల్పపీడనాలు ఏర్పడడం ఇదే తొలిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.