కజకిస్తాన్‌లో ఘోరం జరిగింది. విమాన ప్రమాదం జరగడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 105 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో వెళుతున్న ‘అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్’కు చెందిన జే2-8243 విమానం అక్టౌ విమానాశ్రయ పరిధిలో కుప్పకూలింది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు ఆరుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని కజకిస్తాన్ వైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచ్న్యాలోని గ్రోజ్నీకి వెళ్లాల్సిన విమానం మధ్యలోనే కుప్పకూలింది. పొగమంచు కారణంగా దారి మళ్లించడంతో పక్షి విమానాన్ని ఢి కొట్టిందని ఆ వెంటనే అత్యవసర ల్యాండింగ్ కు అనుమతి కోరి విమానాన్ని దించుతుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే సహాయ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.