ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి
భారత వ్యోమగాములను 2040 నాటికి చంద్రునిపైకి పంపాలనే లక్ష్యంతో ఇస్రో పని చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్రో పరిశోధనల కోసం రూ. 31,000 కోట్ల నిధులను కేటాయించేందుకు ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. త ద్వారా రాబోయే 15 ఏళ్లలో చంద్రునిపై భారత వ్యోమగాములు అడుగుపెట్టాలనే ప్రయత్నాలకు మరింత ఊతం లభించిందన్నారు.
రాబోయే 25 సంవత్సరాల్లో చేయాల్సిన ప్రయోగాలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. 2035 నాటికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్‌ను, అంతకంటే ముందు 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం తమ లక్ష్యాలని వివరించారు. 2035లో ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్‌కు కార్యచరణను సిద్ధం చేయడం, 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగాముల్ని పంపే లక్ష్యాలు తమ విజన్‌లో ఉన్నాయని సోమనాథ్ వివరించారు.