మణిపూర్ గవర్నర్‌గా అజయ్ భల్లా
మిజోరం గవర్నర్‌గా వీకే సింగ్
పలు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కంభంపాటి హరిబాబు ను ఒడిశా గవర్నర్‌గా నియమించారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో కంభంపాటిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేయడంతో పాటు రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఒడిశాకు బదిలీ చేయగా, బిహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా పంపారు. ప్రస్తుత కేరళ గవర్నర్‌గా ఉన్న అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బిహార్‌కు బదిలీ చేశారు.
మిజోరం గవర్నర్‌గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 31న మణిపూర్ గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు.