మహిళా క్రికెట్ పోటీల్లో భాగంగా వెస్టిండీస్, భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి వన్డే లో భారీ విజయం సాధించిన భారత మహిళ క్రికెట్ జట్టు, రెండో మ్యాచ్ లోనూ రికార్డు ఇన్నింగ్స్ స్కోర్ చేసింది. వడదొరలోని కొటాంబి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుతమైన షాట్లతో అభిమానులను అలరించింది.
ఓపెనర్లు స్మృతి మంథాన 47 బంతుల్లో 53 పరుగులు చేయగా, ప్రతికా రావల్ 86 బంతుల్లో 76 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే అర్ధ శతకం కొట్టిన తర్వాత స్మృతి, రన్ ఔట్ గా వెనుదిరిగింది. 16.3 బంతిని ఆడి రామ్ హరఖ్ చేతిలో ఔట్ అవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. మరో ఓపెనర్ ప్రతికా రావల్ 28.6 వబంతికి వెనుదిరిగింది.
హర్లీన్ డియోల్ బ్యాట్ తో మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోర్ చేయగల్గింది. హర్లీన్ , 98 బంతుల్లో 102 పరుగులు చేసి శతకం నమోదు చేసింది. అనంతరం 115 పరుగుల వద్ద కియానా బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయింది. దీంతో భారత్ 331 పరుగుల వద్ద నాలుగో వికెట్ నష్టపోయింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, 18 బంతుల్లో 22 పరుగులు చేసి బౌల్డ్ అయి అభిమానులను నిరాశపరిచింది. అఫీ ఫ్లెచర్ బౌలింగ్ లో 35.5 బంతికి పెవిలియన్ చేరింది. దీంతో క్రీజులోకి జెమిమా రోడ్రిగ్స్ అడుగుపెట్టి, హర్లీన్ కు మంచి సహకారం అందించింది. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐదో వికెట్ గా వెనుదిరిగింది.
నిర్ణీత 50 ఓవర్లకు గాను భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో రిచా ఘోష్(13 ), దీప్తి శర్మ(4 ) క్రీజులో ఉన్నారు.