డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్ నాయకులేనని బీజేపీ ఏపీ అధ్యక్షులు పురందేశ్వరి విమర్శించారు. ఆమె రాజమహేంద్రవరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ రెండు సార్లు లోక్‌సభకు పోటీ చేసినా, గెలవకుండా చేసింది కాంగ్రెస్ నేతలేనని ఆమె గుర్తు చేశారు. అంబేద్కర్ లోక్‌సభలో అడుగుపెట్టకుండా చేసింది కాంగ్రెస్ నేతలనే విషయం రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు.
అంబేద్కర్‌కు వాజ్‌పేయ ప్రధానిగా ఉన్న సమయంలో భారతరత్న ఇచ్చి గౌరవించిన విషయాన్ని పురందేశ్వరి గుర్తుచేశారు. అంబేద్కర్‌ను బీజేపీ గౌరవించిందని ఆమె తెలిపారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదనల్లో నిజం లేదన్నారు. ఏపీలో బీజేపీ 25 లక్షల సభ్యత్వాలు పూర్తి చేయబోతోందన్నారు. అల్లు అర్జున్ సంధ్యా థియోటర్ సినిమా హాలుకు వచ్చిన సమయంలో మరింత భద్రత పెంచి ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.