వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై విజయవంతంగా పరుగులు తీసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్ ట్రెయిన్‌కు మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు నిర్వహించిన ట్రయల్‌రన్ విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్ నుంచి కజురహో చేరిన వందేభారత్ స్లీపర్ ట్రెయిన్, శనివారం మహోబాకు చేరుకుంది.
కజురహోకు వెళ్ళే సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు, తిరుగు ప్రయాణంలో 130 కిలోమీటర్ల వేగంతో నడిచింది.ఈ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. వేగంతో వెళ్లేలా తయారుచేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది.
వందే భారత్ స్లీపర్ రైలులో 823 మంది ప్రయాణించవచ్చు. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.