జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రామసుబ్రమణియన్ నియమిస్తూ రాష్ట్రప్రతి ద్రౌపతి ముర్ము ఉత్తర్వలు జారీ చేశారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా పదవీకాలం జూన్1తో ముగియడంతో ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉంది. తాత్కాలిక చైర్‌పర్సన్‌గా ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు విజయ భారతి సయాని ప్రస్తుతం సేవలందిస్తున్నారు.
కొత్త చైర్పర్సన్ ఎంపిక కోసం డిసెంబర్ 18న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ సమావేశమైంది. కమటీ సిఫార్సు మేరకు చైర్మన్ గా రామసుబ్రమణియన్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి లను నియమించారు.
ప్రియాంక్ కనూంగో గతంలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.