దేవాదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
హిందూయేరత మతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు, మొదలగువాటిని శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్రదర్శించటం పూర్తిగా నిషేధించమన్నారు. దేవస్థానానికి సంబంధించిన వాహనాలపై అన్యమత సూక్తులు, బొమ్మలు, బోధనలు, అన్యమతానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్‌లను అనుమతించబోమని స్పష్టం చేశారు.
అన్యమత ప్రచారానికి సహకరించిన దేవాదాయ ఉద్యోగులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగులు కూడా నిబంధనలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు.
జగద్గురువు శంకరాచార్య స్వామి, శ్రీశైల క్షేత్రాన్ని భారతీయ సంస్కృతికి, ధార్మిక పరంపరలకు ముఖ్య కేంద్రంగా పేర్కొన్న ప్రతీ ఒక్కరూ గుర్తుంచకోవాలన్నారు. ఆదిదంపతుల దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడు దేవాదాయ శాఖ నిబంధనలు పాటించాలని సూచించారు.