బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ ఆరా తీశారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం నడుపుతోన్న ప్రధాని యూనస్‌లో జాక్ ఫోన్లో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నందుకు యూనస్‌కు అభినందనలు తెలిపారు. అక్కడి మైనారిటీలపై దాడులను ఆపాలని సూచించారు.తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు యూనస్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్ నుంచి బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న హింసలో 500 మందికిపైగా చనిపోయిన సంగతి తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరవాత యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఆగష్టు నుంచి అక్టోబరు 22 వరకు బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై 88 దాడులు జరిగాయని, ఈ ఘటనలకు పాల్పడిన 70 మందిని అరెస్ట్ చేసినట్లు యూనస్ ప్రభుత్వం ప్రకటించింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా భారత్‌లో తలదాచుకుంటోందని, ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని, తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలంటూ బంగ్లాదేశ్ అమెరికాను కోరింది.