కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి 5, 8 తరగతులు పాస్ అయితేనే విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేస్తారు. ఇప్పటికే ఈ విధానాన్ని 16 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం అధీనంలో నడుస్తోన్న 3 వేల కేంద్రీయ, నవోదయ, సైనిక్ పాఠశాలల్లో కూడా అమల్లోకి రానుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే విద్య అనేది రాష్ట్రాల జాబితాలో ఉండటంలో ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
విద్యార్థులు ఒకవేళ 5, 8 తరగతుల్లో ఫెయిల్ అయితే వారికి రెండు నెలల సమయం ఇస్తారు. పరీక్షలు నిర్వహిస్తారు. మరలా ఫెయిల్ అయితే ఇక అదే తరగతిలో కొనసాగాల్సి ఉంది. దేశంలో ఇప్పటికే ఈ విధానాన్ని 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచి అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పదో తరగతి వరకు ఏటా పరీక్షలు నిర్వహించినా, తప్పనిసరిగా పాస్ కావాలనే నిబంధన కఠినంగా అమలు చేస్తే డ్రాపవుట్లు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది.