బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఒలింపిక్స్లో మెడల్ సాధించి సత్తా చాటిన పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయి వివాహం కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుక రాజస్థాన్ ఉదయ్సాగర్ సరస్సులోని రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11గంటల 20 నిమిషాలకు జరిగింది.
వివాహ వేడుకలకు కొద్ది మంది ప్రముఖులు హాజరయ్యారు. సింధు కుటుంబ సభ్యులు, సాయి కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ క్రీడకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావడంలో పీవీ సింధు తనదైన ముద్ర వేసింది. ఒలింపిక్స్లో పతకాలు సాధించి సత్తా చాటిన పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టినా మరి కొన్నాళ్లు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.