ఉత్తరప్రదేశ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి ఆటోమేటెడ్ తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్పై ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. యూపీలోని పురానాపుర్ వద్ద ఈ ఎన్కౌంటర్ జరిగింది.
వచ్చే నెలలో యూపీలో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరగనుంది. దాదాపు 50 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వస్తారని అంచనా. ఆ సమయంలో ఉగ్రవాదులు హింసకు దిగేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల హెచ్చరికలతో యూపీ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.