మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు వినూత్నంగా ఓ గ్యాంగ్స్టర్ను అరెస్ట్ చేశారు. రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్ విశాల్ మేశ్రామ్ పుష్ప 2 సినిమా చూడటానికి వస్తాడంటూ నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. వెంటనే పోలీసులు అతని కారును ట్రాక్ చేశారు. కారు నాగపూర్లోని ఓ థియోటర్ పార్కింగ్ స్థలంలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన నాగపూర్ పోలీసులు థియేటర్లో ప్రవేశించి మాదక ద్రవ్యల స్మగ్లర్ విశాల్ మేశ్రామ్ను అరెస్ట్ చేశారు. సినిమా సీరియస్గా నడుస్తున్న క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు. పది నిమిషాల్లో పని పూర్తి కావడంతో సినిమా ప్రదర్శించారు.
విశాల్ మేశ్రామ్ కరడుకట్టిన స్మగ్లర్. రెండు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. మొత్తం 27 కేసుల్లో నిందితుడు. అతని కోసం మహారాష్ట్ర పోలీసులు రెండు సంవత్సరాలుగా వెతుకుతున్నారు. విశాల్ తప్పించుకు తిరుగుతున్నాడు. పుష్పా 2 సినిమాకు విశాల్ వస్తాడని నిఘా వర్గాలు అంచనా వేశాయి. నాగపూర్లోని పాంచ్పావలీ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి చాకచక్యంగా అరెస్ట్ చేశారు.