భారత మహిళల జట్టు విజయాల జోరు కొనసాగిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం కోగా తాజాగా అదే జట్టుపై వన్డేలోనూ భారీ విజయం సాధించింది. వెస్టిండీస్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదరలో జరిగిన తొలి మ్యాచ్‌లో 211 పరుగుల తేడాతో నెగ్గింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ , నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 314 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్ 315 పరుగుల లక్ష్యంతో బ్యాంటింగ్‌కు దిగి పేలవ ప్రదర్శన చేసింది. కేవలం 26.2 ఓవర్లలో 103 పరుగులకే పెవిలియన్ కు చేరింది.
ఫ్లెచర్ (24*) టాప్ స్కోరర్ గా ఉండగా, ఓపెనర్లు మాథ్యూస్ (0), జోసెఫ్ (0) విఫలమయ్యారు. క్యాంప్‌బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 *), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు.
భారత్ బౌలర్లలో రేణుక ఠాకూర్ సింగ్ 5 వికెట్లు పడగొట్టిగా ప్రియా మిశ్రా రెండు, సాధు ఒక వికెట్ తీశారు. రేణుకా సింగ్‌కు తన కెరీర్లో తొలి ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది.