మూడు వన్డేల సిరీస్‌లో వడొదర వేదికగా నేడు భారత్, వెస్టిండ్ మహిళ క్రికెట్ జట్ల (IND w Vs WI w) మధ్య తొలి వన్డే జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు చేసిన దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. భారత వన్డే చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. అంతకుముందు భారత్ అత్యధికంగా 325 పరుగులు చేసింది.
ఓపెనర్లు స్మృతి మంధాన (91), ప్రతీకా రావల్ (40) రాణించారు. హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగ్స్ (31), దీప్తి శర్మ (14*) దూకుడుగా ఆడటతో భారత్ భారీ స్కోర్ చేయగల్గింది. విండీస్ బౌలర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీయగా, హీలీ మాథ్యూస్ రెండు, డాటిన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
లక్ష్య ఛేదనలో విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ తొలి బంతికే క్వినా జోసఫ్ ను జెమీమా రోడ్రిగ్స్ రన్ ఔట్ చేయడంతో పరుగుల ఖాతా తెరవకుండానే విండీస్ వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత మూడు పరుగుల వద్ద కెప్టెన్ మాథ్యూస్ (0) రేణుకా సింగ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగింది. వన్ డౌన్ బ్యాటర్ దీయేద్ర డొట్టిన్ (8) రేణుకా ఔట్ చేసింది. ఆ తర్వాత రషీదా విలియమ్స్ (3) టైటస్ సాదు బౌలింగ్ పెవిలియన్ చేరింది. దీంతో 11 పరుగులకే విండీస్ మహిళల జట్టు నాలుగు వికెట్లు నష్టపోయింది.
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ మహిళల జట్టు భారత్‌లో పర్యటిస్తోంది . టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. నేడు వన్డే సిరీస్ ప్రారంభమైంది.