జేఈఈ అడ్వాన్స్డ్ పై ఐఐటీ కాన్పుర్ కీలక ప్రకటన చేసింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన వారు వచ్చే ఏప్రిల్ ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్-2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 2న ఫలితాలు విడుదల చేస్తారు. ఈ మేరకు ఐఐటీ కాన్పుర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను 17,695 బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ) రాయాలి. దీనిని ఇది జూన్ 5న నిర్వహిస్తారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు