ప్రతీ ఏడాది అక్టోబరు ను హిందూ మాసంగా జరుపుకునేందుకు ప్రవేశపెట్టిన బిల్లును అమెరికాలోని ఒహాయో స్టేట్ హౌస్, సెనేట్లు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఒహాయోలో ఏటా అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా ఘనంగా నిర్వహించుకుంటామని ఆ రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంతానీ తెలిపారు. గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది.
ఒహాయో చరిత్రలోనే తొలి హిందూ, భారతీయ అమెరికన్ స్టేట్ సెనేటర్‌గా అంతానీ ఘనత సాధించారు. స్టేట్ లేదా సమాఖ్యకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడైన హిందూ, భారతీయ అమెరికన్‌గా కూడా ఆయన రికార్డు కెక్కారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు