ముసాయిదా రూపొందించిన కేంద్ర ప్రభుత్వం
లోన్ యాప్లు, రుణం వసూలు పేరిట వేధింపుల కట్టడికి కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవసరాలకు అధిక వడ్డీకి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేక పలువురు బలవన్మరణాలకు పాల్పుడుతుండటంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానుంది.
అనుమతులు లేకుండా భౌతికంగా, ఆన్లైన్ మార్గంలో రుణాలు ఇచ్చే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా విధించేలా కేంద్రం, బిల్లును ప్రతిపాదించింది.
అనియంత్రిత రుణవ్యాపార కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షణకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూపు 2021 నవంబర్ లో తన నివేదికను సమర్పించింది.
ఈ బిల్లు ప్రకారం నియమావళికి విరుద్దంగా రుణాలిచ్చే వారికి కనీసం రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్షతో పాటు రెండు లక్షల రూపాయల నుంచి కోటి వరకూ జరిమానా విధించే అవకాశముంది.
రుణ గ్రహీతలను వేధించడం, అనైతిక పద్ధతుల్లో బకాయిల రికవరీకి పాల్పడే వారికి మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. బంధువులకు ఇచ్చే అప్పులకు ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంటుంది. కేసు తీవ్రతను బట్టి అవసరమైతే సీబీఐకి బదిలీ చేయాలని కూడా బిల్లులో ప్రతిపాదించారు.
బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (బీయూఎల్ఎ,బులా) పేరుతో కేంద్రం ముసాయిదాను రూపొందింది. దీనిపై 2025 ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలపాలని ప్రజలను ప్రభుత్వం కోరింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు