బంగ్లాదేశ్ పై 41 పరుగుల తేడాతో గెలుపు
కౌలాలంపూర్ వేదికగా జరిగిన మహిళల అండర్ – 19 ఆసియా కప్ విజేతగా భారత జట్టు అవతరించింది. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించారు.
ఫైనల్లో బంగ్లాదేశ్ తో తలపడిన భారత్ 41 పరుగులు తేడాతో విజయం సాధించింది. ఫైనల్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 117 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 76 పరుగులకే పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 41 పరుగులు తేడాతోనెగ్గి ట్రోఫీ కైవసం చేసుకుంది.
భారత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ కమిలిని (5), సానికా చల్కే (0) నిరాశ పరిచినప్పటికీ త్రిష (52) రాణించడంతో భారత్ మెరుగైన స్కోర్ చేయగల్గింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12),ఐశ్వరి (5) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. మిథిలా (17), ఆయుషి శుక్లా (10) శ్రమించారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా నాలుగు, నిషితా అక్తర్ నిషి రెండు, హబిబా ఒక వికెట్ తీశారు.
బంగ్లాదేశ్ జట్టులో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మాత్రమే ఫరవాలేదు అనిపించారు. ఇవా( 0), సుమైయా అక్తర్ సుబోర్నా( 8), కెప్టెన్ సుమైయా అక్తర్( 4), సైదా అక్తర్( 5), జన్నతుల( 3), హబిబా( 1), ఫర్జానా (5), నిషిత అక్తర్ (1) పరుగు చేశారు.
భారత బౌలర్లలో ఆయుషి శుక్లా మూడు వికెట్లు తీయగా, సిసోదియా , సోనమ్ యాదవ్ చెరో 2 వికెట్లు తీశారు. జోషిత ఒక వికెట్ తన ఖాతాలో వేసుకోవడంతో భారత్ విజయం ఖాయమైంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు