కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్లోని బరేలి కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్నికల సమయంలో కుల గణనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధం తీసుకువచ్చేలా ఉన్నాయంటూ ఆయనపై కేసు నమోదైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ బరేలి కోర్టు సమన్లు జారీ చేసింది.
గతంలో దీనిపై కొందరు ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశారు. అక్కడ కొట్టివేయడంతో బరేలి కోర్టును ఆశ్రయించారు. బరేలీ కోర్టు రాహుల్కు సమన్లు జారీ చేసింది. జనవరి 7న హాజరు కావాలని సమన్లలో పేర్కొంది.
కులగణన చేయడం ద్వారా దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లోనే దుమారం రేగింది. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ అధికారం ఇస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ యూపీ కాంగ్రెస్ చేసిన ప్రచారం ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదు. కులగణనను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. కులగణన చేయడం ద్వారా ఆయా కులాల జనాభాపై స్పష్టత వస్తుందని కేంద్రం భావిస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు