అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం చేటు చేసుకుంది. రాయచోటి మండలం రాయవరంలో పాత సామాను వ్యాపారులు హనుమంతు, రమణపై కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పాత కక్షల కారణంగా కాల్పులకు తెగబడినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల వాంగ్మూలం తీసుకున్న తరవాత మరిన్ని వివరాలు అందే అవకాశముంది. బాధితుల శత్రువుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. గతంలో వారికి ఎవరితోనైనా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. బిహారుకు చెందిన ముఠా ఈ దారుణానికి దిగినట్లు అనుమానిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు