పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం అస్తవ్యస్తంగా ప్రయాణించి బలహీనపడింది. ప్రస్తుతం చెన్నైకి 480 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 430 కిలోమీటర్లు గోపాల్‌పూర్‌కి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వారం రోజులపాటు అల్పపీడనంగానూ, ఆ తర్వాత వాయుగుండంగా బలపడిన సమయంలో గాలిలో తేమనంతటినీ పీల్చుకుంది. దీంతో సముద్రంలో పొడిగాలుల వాతావరణం ఏర్పడింది.
తేమగాలుల లేమి కారణంగా వాయుగుండం దిక్కుతోచని స్థితిలో ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు. ప్రస్తుతం తూర్పు ఈశాన్య దిశగా నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే శనివారం రాత్రి బలహీనపడిందని వివరించారు. ఈ రోజు మరింత బలహీన పడునుండటంతో రాష్ట్రంపై ఇక ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు.
నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో నేడు మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోతేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు