2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రోసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అనుమతి ఇచ్చారు. మద్యం పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్‌ను ప్రోసిక్యూట్ చేయడానికి అనుమతి కావాలంటూ డిసెంబర్ 5న ఈడీ అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు.
మరోవైపు, కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా పెట్టుకున్న పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఈడీకి ఢిల్లీ హైకోర్టు అదనపు సమయం కేటాయించింది. మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లను పరిశీలించాలన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు పిటిషన్లు దాఖలు చేసారు.
మద్యం పాలసీకి సంబంధించిన కేసులో ఈడీ, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో కేజ్రీవాల్, సిసోడియా ఇద్దరూ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు.