దేశంలో అటవీ విస్తీర్ణం గడిచిన మూడేళ్ళలో సుమారు 1445 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఈ మేరకు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్(ఐఎస్ఎఫ్ఆర్) ను ప్రభుత్వం విడుదల చేసింది. కార్బన్ వ్యర్థాలు 2.29 బిలియన్ టన్నులు తగ్గగా దేశంలో మొత్తం గ్రీనరీ ఏరియా 25.17 శాతానికి చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
2030 నాటికి అదనంగా మరో మూడు బిలియన్ టన్నుల కార్బన్ను తగ్గించేందుకు ప్లాన్ చేసినట్లు నివేదికలో పేర్కొంది 2021లో 7,13,789 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ విస్తీర్ణం … 2023లో 7,15,343 చదరపు కిలోమీటర్లు పెరిగిందని తెలిపింది. చెట్ల విస్తీర్ణం 1289 కిలోమీటర్లు పెరిగినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.