ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. పథకం అమలు తీరుతెన్నుల పరిశీలనకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ, హోం శాఖల మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది.
ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు అవుతోంది, విధివిధానాలు, ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశాలపై ఈ కమిటీ నివేదిక అందజేయనుంది. సబ్ కమిటీ నివేదిక ఆధారంగా ఏపీలో ఈ పథకం అమలు కానుంది.