ప్రముఖ ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం మరో బాధ్యత అప్పగించింది. విద్యార్థులు – నైతిక విలువల సలహాదారు(కేబినెట్ హోదా)గా గతంలో నియమించిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో బాధ్యత అప్పగించింది. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంచేందుకు అవసరమైన పుస్తకాలు తయారు చేయించి, విద్యార్థులకు పంపీణీ చేయనుంది.
రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా చాగంటికి అదనపు బాధ్యతలను అప్పగించారు.
పిల్లలకు ఉపయోగపడేలా మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు. పదవుల కోసం తాను ఒప్పుకోలేదని మరోసారి తెలిపారు. తన ద్వారా పిల్లలకు మేలు జరిగితే చాలు అన్నారు.