ప్రధాని నరేంద్ర మోదీ, కువైట్ పర్యటనకు బయలుదేరారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ప్రదాని మోదీ, కువైట్ రాజు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సహబ్ భేటీ కానున్నారు. భారత ప్రధాని కువైట్కు వెళ్లడం 43 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి.
పర్యటనలో భాగంగా భారత కార్మిక శిబిరాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ, అరేబియా గల్ఫ్ కప్, ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది.
భారత్, కువైట్ మధ్య రక్షణ, వాణిజ్యంతో సహా పలు ఒప్పందాలు జరగనున్నాయి. కువైట్లో జరిగే ‘హలా మోదీ’ కార్యక్రమంలో దాదాపు 4 వేల మంది భారతీయులను మోదీ కలుసుకుంటారని అధికారిక వర్గాలు తెలిపాయి.