రానున్న సీజన్(2025)లో ఎండుకొబ్బరికి కనీస మద్దతు ధర(MSP)ని క్వింటాలుకు రూ.422 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.తాజా పెంపుతో ఎంఎస్పీ క్వింటాలు రూ.12,100 చేరుకుంది. తాజా ప్రతిపాదనలు అనుగుణంగా కేంద్రం రూ. 855 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసింది.
మిల్లింగ్ ఎండుకొబ్బరికి ఎంఎస్పీని క్వింటాలుకు రూ. 422, బంతి కొబ్బరికి ఎంఎస్పీని క్వింటాలుకు రూ. 100 పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడంచారు. ఎండుకొబ్బరి మొత్తం ఉత్పత్తిలో 32.7 శాతం కర్ణాటకలో తమిళనాడులో 25.7 శాతం, కేరళలో 25.4 శాతం, ఆంధ్రప్రదేశ్లో 7.7 శాతం జరుగుతోంది.
ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు నూనె తీయడానికి ఉపయోగించే కొబ్బరిపై 51.84 శాతం, కురిడి కొబ్బరిపై 63.26 శాతం మార్జిన్ లభించనుంది. జాతీయ స్థాయిలో నిర్ణయించిన వెయిటెడ్ ఉత్పత్తి వ్యయంతో పోల్చితే ఇది 1.5 రెట్లు ఎక్కువ.