ఉత్తరప్రదేశ్ సంభల్ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బర్క్‌పై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. సంభల్‌లోని దీప్ సరాయ్ ప్రాంతంలో రెహమాన్ నివాసం ఉంటున్నాడు. అతని ఇంటిలో విద్యుత్ చౌర్యం వ్యవహారం వెలుగు చూసింది. విద్యుత్ శాఖ అధికారులు పాత మీటర్లు స్వాధీనం చేసుకుని, డిజిటల్ మీటర్లు అమర్చారు. పాత మీటర్లకు సంబంధం లేకుండా పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లు గుర్తించారు. ఎంపీ జియావుర్ రెహమాన్‌కు కోటి 91 లక్షల జరిమానా విధించారు. అధికారులు ఎంపీ నివాసానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
విద్యుత్ మీటర్ల తనిఖీ సమయంలో అధికారులపై ఎంపీ తండ్రి మమ్లుకూర్ రెహమాన్ బర్గ్ బెదిరింపులకు పాల్పడ్డాడని సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా తెలియాల్సి ఉంది.
సంభల్‌లో పురాతన శివాలయంలో పురావస్తుశాఖ అధికారుల సర్వేను స్థానికులతో కలసి ఎంపీ రెహమాన్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అధికారులకు రక్షణగా వచ్చిన పోలీసులపై కూడా పెద్దఎత్తున దాడి చేసి గాయపరిచారు. తరవాత చెలరేగిన హింసలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తరవాత యూపీ ప్రభుత్వం అక్కడ అక్రమ విద్యుత్ సబ్ స్టేషన్ గుర్తించారు. ఎంపీ నివాసంలో విద్యుత్ చౌర్యంపై కేసు నమోదు చేశారు.