గెజిట్ జారీ చేసిన ఏపీ ఎన్డీయే ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ ధర్మకర్తల మండళ్ళలో మరో ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పిస్తూ గెజిట్ జారీ చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు బ్రాహ్మణ, మరొకరు నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారు ఉంటారని ఉత్వర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రెలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ చట్టం-1987ను ప్రభుత్వం సవరించింది.
దేవాలయాల స్థాయి, వార్షికాదాయాన్ని బట్టి ప్రస్తుతం వివిధ ఆలయాల ధర్మకర్తల మండళ్లలో 7 నుంచి 15 మంది సభ్యుల్ని నియమించుకునే అవకాశముంది. తాజా గెజిట్ కు అనుగుణంగా ప్రస్తుతం మరో ఇద్దరు ధర్మకర్తలు పెరగనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10,763 ఆలయాల్లో ధర్మకర్తల మండళ్లను నియమించాల్సి ఉంది.