ధనాబాద్ జంక్షన్ నుంచి కేరళలోని అలప్పుళకు బయలు దేరిన రైలులో అగ్నిప్రమాదం జరిగింది. మధుకరై స్టేషన్ సమీపంలో ఎస్ 7 బోగీలో దట్టంగా పొగలు వ్యాపించాయి. అయ్యప్ప భక్తులు చైన్ లాగడంతో ఫైలెట్ ట్రైన్ నిలిపివేశారు. వెంటనే రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు వ్యాపించడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అలప్పుళ రైలులో తెలంగాణలోని ఇల్లెందుకు చెందిన అయ్యప్ప భక్తులు ఉన్నారు. రైలులో పొగలు గుర్తించగానే వెంటనే అధికారులకు సమాచారం అందించారు. పొగ దట్టంగా వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. మంటలను వెంటనే అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.