వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పంపించారు. ఆనంద్ వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆనంద్ సహా 12 మంది డైయిరీ డైరెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.గత కొంత కాలంగా ఆనంద్ వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
విశాఖ డెయిరీ డైరెక్టర్లు వరాహ వెంకట శంకర్రావు, శీరంరెడ్డి సూర్యనారాయణ, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణ, చిటికెల రాజకుమారి, పిల్లా రమా కుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశి గంగాధర్ రాజీనామా సమర్పించారు. వీరంతా పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన లేఖను వైసీపీ అధినేతకు పంపించారు.
విశాఖ డెయిరీలో వందల కోట్ల అవినీతి జరిగిందే ఆరోపణలపై విచారించేందుకు ఏపీ ప్రభుత్వం కమిటీ వేసింది. కమిటీ విచారణ చేపట్టింది. విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆనంద్ విశాఖ డెయిరీ నిధులను అక్రమంగా కొల్లగొట్టారనే ఆరోపణలు కొనసాగుతున్న వేళ, ఆయన రాజీనామా చర్చకు దారితీసింది.