13 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఉద్యోగార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త చెప్పింది. పెద్దసంఖ్యలో ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. పలు బ్రాంచిలలోని 13 వేల జూనియర్ అసోసియేట్, క్లర్కు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వివరించింది.
మొత్తం 13 వేల పోస్టులలో 5 వేలకు పైగా జనరల్ కేటగిరీలో ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ప్రారంభంలోనే రూ.47 వేల వరకు జీతం అందుకుంటారు. డీగ్రీ అర్హతతో పాటు 20 నుంచి 28 ఏళ్ల మధ్య (1996 ఏప్రిల్ 2 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వారు) దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.ఎస్ బీఐ అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి.
తొలి దశలో ఆన్ లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష, అందులో అర్హత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.