60 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై గెలుపు
భారత మహిళా క్రికెటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత
భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 2-1తేడాతో నెగ్గింది. మూడో మ్యాచ్ లో
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన 47 బంతుల్లో 77 పరుగులు చేయగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ , 21 బంతుల్లో 54 పరుగులు చేసింది. వీరిద్దరికీ తోడుగా జెమీమా రోడ్రిగ్స్ (39),రాఘ్వీ బిస్త్ ( 31*) రాణించడంతో భారత్ మంచి స్కోర్ చేయగల్గింది.
మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రిచా ఘోష్ వేగవంతమైన అర్ధ శతకం చేసి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఐదో స్థానంలో క్రీజులోకి వెళ్ళి కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగులు చేసింది.దీంతో మహిళల టీ20 క్రికెట్‌లో ఉన్న ఫాస్టెస్ట్ ఫిఫ్టీ వరల్డ్ రికార్డును ఆమె సమం చేసింది.అంతకు ముందు ఈ ఘనతను సోఫీ డివైన్, లిచ్‌ఫీల్డ్ సాధించారు.
లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43 పరుగులు) పోరాడినప్పటికీ ఆ జట్టులో 60 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్‌మిగతావారు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో రాధ యాదవ్ 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. రేణుకా సింగ్, టిటస్ సాధు, దీప్తి శర్మ, సజీవన్ సజన ఒక్కో వికెట్ తీశారు.
ఇరు జట్ల మధ్య వడోదర వేదికగా ఆదివారం నాడు తొలి వన్డే జరగనుంది.