రెండున్నర సంవత్సరాలుగా సాగుతోన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దశకు వచ్చింది. యుద్ధం ఆపేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. అయితే జెలెన్‌స్కీతో మాత్రం సంప్రదింపులు జరిపేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ పార్లమెంటుతో సంప్రదింపులు జరపడానికి సిద్దమని పుతిన్ ప్రకటించారు. ఎలాంటి షరతులు లేకుండా సంప్రదింపులకు తాము సిద్దంగా ఉన్నట్లు పుతిన్ విలేకరుల వార్షిక సమావేశంలో స్పష్టం చేశారు.
రష్యా సేనలు విజయానికి చేరువగా ఉన్నాయని, ప్రతి రోజూ చదరపు కి.మీ కొద్దీ ఉక్రెయిన్ భూ భాగాన్ని స్వాధీనం చేసుకుంటున్నాయని పుతిన్ తెలిపారు. నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడలేదని, కాబాయే యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లో మాట్లాడేందుకు తాను సిద్దమని ప్రకటించారు.
ఉక్రెయిన్,రష్యా యద్ధం ముగింపు దశకు చేరబోతోంది. ఇప్పటికే రష్యా భారీగా సైనికులను కోల్పోయింది. చివరకు ఉత్తర కొరియా నుంచి సైనికులను అరవు తెచ్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు చేరవేస్తూనే ఉన్నాయి. దీంతో రష్యా అధ్యక్షుడు యుద్ధానికి ముగింపు పలకాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.