క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో మరో 24 వేల కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు క్యాబినెట్ అనుమతించింది. ఇందుకు హడ్కో నుంచి రూ.11 వేల కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అమరావతిలో కొత్తగా నిర్మించబోయే అసెంబ్లీ భవనం, హైకోర్టు, పరిపాలనా భవనాలకు ఆమోదం తెలిపింది. రాజధానిలో మౌలికసదుపాయాలకు రూ.6 వేల కోట్లు ఖర్చుకు మంత్రివర్గం సమ్మతించింది. జనవరిలో పనులు ప్రారంభించి 36 నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి మరో పది ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. ఇంటర్మీడియట్ విద్యార్ధులకు మధ్యాహ్నం ఉచిత భోజనంతోపాటు, ఉచితం పుస్తకాలు పంపిణీ చేయడానికి అవసరమయ్యే ఖర్చులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అక్రమంగా విదేశాలకు బియ్యం ఎగుమతులపై కూడా క్యాబినెట్లో కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించే విషయంలోనూ చర్చించారు.