రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం ఆఫ్ఘనిస్థాన్‌లో చోటుచేసుకుంది. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 50 మంది చనిపోయాగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది.మృతుల్లో కొందరు పాకిస్తాన్ వారు కూడా ఉన్నారని సమాచారం. పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.
కాందహార్ కాబూల్ హైవేపై ఆయిల్ ట్యాంకర్ బస్సు ఢీ కొన్న ఘటనలో 30 మంది చనిపోయారు. మరో ప్రమాదంలో అదే రహదారిపై ట్రక్కు బస్సు ఢీకొని 20 మంది చనిపోయారు. 70 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఘాజ్జీ ప్రావిన్స్‌లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.